Song no:

ఆది నీవే అంతం నీవే
ప్రభవం నీవే ప్రళయం నీవే
అల్ఫయు నీవే ఓమెఘయూ నీవే
విలయం నీవే స్ధిర నిలయం నీవే
జగతిని నడిపే జ్యోతివి నీవే
సమరం అమరం సర్వము నీవే
అన్ని నామములు ప్రణమిల్లే
సర్వోన్నత నామం నీవే ॥2॥
  1
సర్వలోక న్యాయాధిపతీ ॥4॥
సర్వలోక న్యాయాధిపతీ
వాకిట నిలచియున్నాడు...........
జనములందరికి ఫలమిచ్చుటకు
తీర్పుతీర్చబోతున్నాడు } 2
వేల దూతలతొ బూర ధ్వనులతో
మేఘమండలము పైనా ...........
యూదా గోత్రపు కొదమ సింహముతొ
కదలి వస్తుంది సేనా.....
క్రీస్తు న్యాయ పీఠం ఎదుటా ...........
ప్రత్యక్షం కావాలందరూ
క్రీస్తు న్యాయ పీఠం ఎదుటా
ప్రత్యక్షం కావాలందరూ       
   2
అన్యాయమే చేయు వారినీ
అన్యాయమే చేయనిమ్ము
అపవిత్రునిగా ఉన్న వారినీ
అపవిత్రునిగా ఉండనిమ్ము
పరిశుధ్ధుడై ఉన్న వానిని
పరిశుధ్ధునిగా బ్రతుకనిమ్ము
అక్రమములనే చేయువానిని
అక్రమములనే చేయనిమ్ము
నీతిమంతునీ నీతిమంతునిగా
కొనసాగుతు ఉండనిమ్మూ
ఎవని క్రియలకు తగిన ఫలమును
వానికిచ్చుటకు గాను
ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు
ఇదిగిదిగో త్వరగా వచ్చుచున్నాడు
మోషేను విడిచిపెట్టలేదు
దావీదునే వదలలేదు
పక్షపాతమాయనకు లేదు
అవిధేయతకు శిక్ష తప్పదు
క్రీస్తు న్యాయపీఠము ఎదుటా
ప్రత్యక్షం కావాలందరూ           }॥2॥
   3
తమ హృదయమే కోరువారును
జగమంతా జరిగించగలరు
వారు విత్తినది ఏమైయున్నదో
ఆ పంట కోసి తీరుతారు
స్వాతంత్ర్యమే వారికున్నదని
స్వచిత్తమును స్ధాపించినారు
దైవ చిత్తముకు వ్యతిరేఖముగా
దుష్కార్యములు చేయువారు
దీర్ఘ శాంతము ఎంత కాలము
యేసు ప్రభువా త్వరగా రమ్మూ
భూలోకమునకు తీర్పు తీర్చుటకు
దినము నిర్ణయించాడు
వాక్యమునే తీర్పరిగా నియమించాడు
చట్టముగా వాక్యమునే స్థాపించాడు
రాజులను విడువలేదు
చక్రవర్తులను వదలలేదు ఎవరైనా లెక్కలేదు
ఆపాటికే శిక్ష తప్పదు
క్రీస్తు న్యాయపీఠము ఎదుటా
ప్రత్యక్షం కావాలందరూ           }॥2॥
            ॥సర్వలోక న్యాయాధిపతీ॥