ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు కాపరి

    Song no: 46
    ఇమ్మానుయేలు దేవుడా
    ఇశ్రాయేలు కాపరి
    కునుకని నిద్రించని
    కన్నతండ్రివి నీవేనయా
    నీవేనయా యేసయ్యా
    నీవేనయా యేసయ్యా

    కలతతో కన్నీటితో కృంగి నేనుండగా
    నాదరి చేరి నన్నాదరించిన
    నాదు కాపరి

    దోషములో చిక్కుబడి తొట్రిల్లుచుండగా
    హస్తము చాపి నను బలపరచిన
    నాదు కాపరి