ఊహలకందని నీ దివ్య ప్రేమ ఉన్నతమైన ఆ సిలువ ప్రేమ


    Song no: 13
    ఊహలకందని నీ దివ్య ప్రేమ
    ఉన్నతమైన ఆ సిలువ ప్రేమ
    మారనిది మరువనిది
    విడువనిది ఎడబాయనిది

    1. నా తల్లి నాపై చూపని ప్రేమ
        నా తండ్రి నాకై చేయని త్యాగం
        చూపావు దేవా పశువుల పాకలో
        చేసావు దేవా కలువరి గిరిలో

    2. కాలలు మారిన మారని ప్రేమ
        తరాలు మారిన తరగని ప్రేమ
        తరతరములకు నిలిచిన ప్రేమ
        తరగదు ప్రభువా నీ దివ్యప్రేమ

    3. కలుషము బాపిన కలువరి ప్రేమ
        కన్నీరు తుడిచె కరుణగల ప్రేమ
        మత్చ్సర పడని ఢంబము లేని
        చిరజీవమిచ్చే ఆ సిలువ ప్రేమ