వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో


వాడబారని విశ్వాసముతో }
శుభప్రదమైన నిరీక్షణతో    }॥2॥
వేచియున్నానయ్యా...
కనిపెట్టుచున్నానయ్యా...యేసయ్యా  ॥2॥
నీ రాకకోసమై కడబూర శబ్దముకై
నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై
                                      ॥వాడబారని॥
            1॰
మోకాళ్ళపై వేచితీ...           }
కన్నీళ్ళ పర్యంతమై...          }
బీడు బారిన నేల వానకై...    }॥2॥
యెదురుచూచిన చందమై... }
సిధ్ధపడియున్న వధువునై...         }
ఆశతో వేచానయ్యా...యేసయ్యా }॥2॥
                                   ॥నీ రాకకోసమై॥
            2॰
లేఖనములను చూచితి.... }
గురుతులు గమనించితీ.... }
ప్రవచన నెరవేర్పులన్నీ....   }॥2॥
జరుగుట గుర్తించితీ....       }
రారాజువై నీవు రావాలనీ...           }
యెదురుచూచు చున్నానయ్యా.....}॥2॥
యేసయ్యా                                   }
                                   ॥నీ రాకకోసమై॥
             3॰
నీతి కొరకై వేచినా              }
గూడబాతును పోలిన        }
ఆత్మ దాహము తోడ నిండి  }॥2॥
అల్లాడుచున్నానయ్య........ }
లోక బంధాల నుండి         }
నీ చెలిమి కోరానయ్యా......}॥2॥
                                    ॥నీ రాకకోసమై॥