Song no:
- చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం } 2
- మేం చేసే ఈ యుద్ధం శరీరులతో కాదు - ఆకాశ దురాత్మలతో శక్తులతోనే పోరు -2
ప్రధానుల్ అధికారులెవరైన - అంధకార సంబంధ నాధులైన
యేసయ్య నామంలో వంగాలి - యేసయ్య నామంలో ఓడాలి
యేసయ్య నామంలో వంగాలి ఓడాలి - ప్రభుకే మ్రొక్కాలి
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం
- అపవాది తంత్రాలు మేం ఎరుగని వారము కాము - మా నోటి సాక్ష్యముతో ప్రభు రక్తముతో గెలిచెదము -2
సర్వాంగ కవచాన్ని ధరియించి - విశ్వాస డాలును ముందుంచి
అపవాది అగ్ని బాణాలార్పేస్తాం - శ్రమ శోధన దూషణలన్నిటి జయిస్తాం
అపవాది అగ్ని బాణాలార్పేస్తాం గెలిచేస్తాం ప్రభునే స్తుతిస్తాం
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం
- హృదయానికి ప్రభువిచ్చాడు నీతి అనే కవచం - ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచి చెరపడతాం -2
దేవుని నీతి మేం అగునట్లు - మా నీతి ప్రభువే అయ్యాడు
సింహంలా ధైర్యముగా మేముంటాము - ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాము
సింహంలా ధైర్యముగా మేముంటాము లేస్తాము ప్రభునే చూస్తాము
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2
ఏనాడో గెలిచాడు యేసు దేవుడు - శత్రువుని మన పక్షాన
అపవాది తల త్రొక్కి లేచినాడుగా - మనకివ్వ విజయాన్ని.......
యే యే యే యే యే
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం -2