గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత 
నడిపితివి కృపచేత యేసయ్యా
విడువక కాచిన నా ప్రాణదాతా 
అ.ప: ఆరాధన - ఆరాధన - నీకే నీకే విశ్వనేత 

1. 
చీకటి కామ్ముకురాగా - మార్గము మూసుకుపొగా
నను ఆగిపోనీలేదే 
అరణ్యములో బాటలు వేసి - వంకర త్రోవలు తిన్నగ చేసి 
క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా

2. 
శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా 
నను ఓడిపోనీలేదే
విరోధులను ఆటంకపరచి - నా పక్షమున యుద్దము జరిపి 
విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా

3. 
జగతికి యేసుని చూపించి - జనులకు రక్షణ చాటించి 
ప్రతి క్రైస్తవుడొక తారకలా - నిలవాలి వెలుగును పంచి