యేసు క్రీస్తు శిలువపై పలికిన మొదటి మాట మొదటి మాట :- క్షమించుట

Image may contain: one or more people and text


✝ యేసు క్రీస్తు శిలువపై పలికిన మొదటి మాట. ✝
🏵మొదటి మాట :- క్షమించుట
(రెండవ భాగము)
👉 ముఖ్యంగా ఈ మాటను మనం మూడు భాగములుగా ధ్యానించవచ్చును.
1. తండ్రీ!
2. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు
3. వీరిని క్షమించుము.
2⃣వీరేమి చేయుచున్నారో:-
వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చేయుచున్న ఈ ప్రార్ధన మనం కొంచెం లోతుగ చూస్తే, యేసును భయంకరంగ చిత్రవధకు గురిచేసిన 👉 " వీరు "
అనే పదంలో ఎందరున్నారు?
సహోదరా! ఆయన స్వజనులైన యూదులు మరియు ఆన్యులు అనే ఈ రెండు గుంపులు ఏకముగా కూడి ఆయనను సిలువ వేసినందున వీరి మీద నేరారోపణ చేయక, వారిని శిక్షకు గురిచేయ్యక వీరి క్షమాపణ కొరకు యేసయ్య ప్రార్ధిస్తున్నాడు.
👉 యేసయ్యను యూదులు అప్పగించగ,
👉 అన్యులు ఆయనను సిలువ వేసిరి.
ఈ సందర్భములో మతనాయకులు, యూదులు, ఆన్యులు, సామాన్య ప్రజలు, అధికారులు ఏకమైనారు. వీరందరు ఏకముగ కూడి యేసుకు వ్యతిరేకముగ ఆలోచన చేసిరి, ఆయనను సిలువకు అప్పగించిరి.
ఆయన రక్షకుడని వీరెరుగరైతిరి. అందుకే యేసయ్య తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రార్ధిస్తున్నాడు.
అందువలననే యేసయ్య వీరందరి నుద్దేశించి ఈ ప్రార్ధన చేయుచున్నాడు.
👉 ఇంతకు ఆ వీరులో నీవు వున్నావా?
ప్రియులారా! ఈ విషయమును బాగుగా ఎరుగుము. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము .హెబ్రి.6:5,6
మరల మరల పాపం చేస్తూ శిలువ చేస్తున్నావా?
✝ ఎరుగరు :- వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనేమాట మనం ద్యానం చేస్తున్న మొదటి మాటలో రెండవ భాగానికి చెందినది. వీరుపిలాతుతో సిలువవేయుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. ఈ కేకలు తెలియక వేసినవి కాదు. మత్తయి 27:22, మార్కు 15:13,14; లూకా 23:21 ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాకని కోరిరి మత్తయి 27:25 ఈ కోరిక కూడ వారికి తెలుసు. యేసుకు విరోధంగా వీరు మోపిననేరములు అన్నీ అబద్దాలని తెలుసు. యేసయ్య తిన్న దెబ్బలు, ఆయన పొందిన వేదన, అవమానం అన్నీ వీరికి తెలుసు. ఈయన ఈ భయంకర చిత్రవధకు కొన్ని గంటల్లో చనిపోతాడనికూడ వీరికి తెలుసు.
కాని వారు చేయుచున్న పని (యేసును అనగ రక్షకుని సిలువవేయుట) ఎంత ఘోరమైనదో, ఎంత భయంకరమైనదో తెలుయదు. ఈయన సర్వలోక పాపపరిహారార్ధం బలిగావించబోవుచున్నాడని ఎరుగరు. ఈయనే మెసయ్య అని ఎరుగరు.
వీళ్ళయొక్క అఙ్ఞానాన్ని ఎరిగి ప్రభువు ప్రార్ధిస్తున్నాడు. ఆయన నిత్యుడగు తండ్రి అని వీరు ఎరుగలేదు. ఆయన ముఖము మీద ఉమ్మివేసారు. ఆయనను పిడిగుద్దులు గుద్దారు. అరచేతులతో ఆయన చెంపల మీద కొట్టారు. ఇంతచేసి నిన్నెవరు కొట్టారో ప్రవసించుము అని అపహాస్వం చేసారు. అయనను యేసు ప్రేమ ఎంత దృఢమైనదో, స్ధిరమైనదో ఈ ప్రార్ధనే రుజువు చేయుచున్నది. వీరు ప్రభువును సిలువ వేయుట ద్వారా ఎంత ఘోరానికి పాల్పడుతున్నారో వీరికి తెలియదు.
ఏ మానవుడు సహించలేని అవమానాన్ని, భరించలేని బాధను, భయంకరమైన చిత్రవధను తన మనస్సులోనే దాచుకుంటూ తన కళ్ళముందే వుండి ఎంతో భయంకరత్వాన్ని కనుపరస్తూవున్న రోమా రౌడీలను ఇతరత్రా అక్కడ నిలుచున్న వారిని ఉద్దేశించి చేస్తున్న ప్రార్ధన ఆయనే మనకు నిజమైన ప్రధానయాజకుడు అని రుజువు చేయుచున్నది హెబ్రి 7:26 మరియు ఆయన మానవులకు దేవునికి మధ్యవర్తి అనే విషయం కూడ బోధపడుతున్నది 1తిమోతీ 2:5. ఈ ప్రార్ధన మనకు మాదిరికరమైన ప్రార్ధన. కనుక ఇట్టి ప్రార్ధన అనుభవం కలిగి జీవించుదము గాక!
3⃣ వీరిని క్షమించుము :- తాము చేయుచున్న పని ఎంత ఘోరమైనదో, ఎంత భయంకరమైనదో వీరికి తెలియదు. ఆయన లోక కళ్యాణం కోసం ప్రభువు చేసిన ఎన్నో అద్భుతాలు వీళ్ళు చూసారు. ఆయన దేవుని కుమారుడని వీరికి తెలియదా? వీరి హృదయాలకు మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించింది 2కొరింధీ4:4
యేసు సిలువ శ్రమలు అనుభవిస్తూ కూడ ఆత్మీయ సత్యాలను ఎరిగియున్నాడు. ఆయన సిలువ కొయ్యకు బిగించబడకమునుపు ఎందరినో నీ పాపములు క్షమించబడి యున్నవని చేప్పి వారి పాపాలు క్షమించాడు. ఎందుకంటే ఆయనకే పాపాలు క్షమించే అధికారం ఇయ్యబడింది .మత్తయి 9:6; అపో 4:12
ప్రియులరా! యేసు మాత్రం సిలువ శత్రువుల కొరకై ప్రార్ధించుచున్నాడు. వారిని ప్రేమించాడు. వారిలోని పాపాన్ని ద్వేషించాడు. కానీ వీరి కోసం, వీరి క్షమాపణ కోసం ప్రార్ధిస్తున్నాడు. మన ప్రభువుది ఎంత దయార్ధహృదయమో గమనించండి. తీర్పు తీర్పు పని మనది కాదు అని యేసు న్యాయముగ తీర్పు తీర్చే దేవునికి తన్నుతాను అప్పగించుకున్నాడు 1పేతురు 2:23 మనం పాపం చేసినను ఆయన కృపాక్షమాపణలు గల దేవుడు దానియేలు 9:9 గనుక ఆయన మనలను క్షమించును. అందుకే యేసు చూపిన మార్గమున సాగిపొమ్ము! నీవును ఇట్టి ఆత్మీయ అనుభవమును పొందుకొనుము. యేసును మాదిరిని ఎరిగి అట్టి మాదిరి కనపరచుము. దేవుడు నిన్నును క్షమించుగాక! దీవించుగాక ! ఆమెన్...

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.