Papamu anaga nemi ? పాపము మనిషిని ఏమి చేస్తుంది

పాపము
   

పాపము మనిషిని ఏమి చేస్తుంది అంటే?

•పాపం తరమడం మొదలుపెడుతుంది,
•ఎక్కడున్నా పట్టుకొంటుంది,
•పట్టుకొని ఎటూ కదలకుండా బంధించేస్తుంది.
•దేవునితో సంబంధం లేకుండా చేస్తుంది.
•చివరికి సమాధానం లేకుండా చేసేస్తుంది.

1. పాపము తరుముతుంది:
"కీడు పాపులను తరుమును"
      సామెతలు 13:21

2. పాపము పట్టుకొంటుంది:
"మీ పాపము మిమ్మును
పట్టుకొనును"
              సంఖ్యా 32:23

3. పాపము బంధిస్తుంది:
"దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును."
         సామెతలు 5:22

4. దేవుని నుండి వేరు చేస్తుంది:
"మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను"
     యెషయా  59:2

5. సమాధానం లేకుండా చేస్తుంది:
"దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
             యెషయా 48:22

ఏ స్థితిలో మనమున్నాము?
•దాని చేత తరమ బడుతున్నామా?
•దానికి దొరికిపోయామా?
•దాని చేతుల్లో బంధీగా మారిపోయామా?
•దేవునిని నుండి వేరై పోయామా?
•సమాధానం కోల్పోయామా?

నీవు ఏ స్థితిలోనున్నా సరే!
•నీకునీవుగా దాని చేతుల్లోనుండి తప్పించుకోలేవు.
•నీకునీవుగా పాపంతో పోరాటం చెయ్యడం సాధ్యం కానేకాదు

మరెట్లా సాధ్యం?
పాపము మీద విజయం సాధించి,
నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని లోకానికి సవాలు విసరిన యేసయ్య పాదాల చెంతచేరాలి.
ఆయనతోనే పాపముపై విజయం సాధ్యం.

నేడైనా ఆయన చెంత చేరుదాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్!

పాపం వల్ల జీతం మరణం

పరిచయం:
రచయిత: దావీదు
సందర్భం: దావీదు బత్షెబతో పాపం చేసిన సందర్భంలో నాతాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చినప్పుడు.
ముఖంశాలు: దావీదు పాపం,దాని ప్రతిఫలం, పశ్చాత్తాపం.
పాపము అంటే?
"దేవుడు చెయ్యవద్దు అన్నది చెయ్యడం, దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం."

పాపము:
*చూడడానికి అందముగా వుంటుంది.
*చేస్తున్నప్పుడుఆనందాన్నిస్తుంది.
*చేసాక ఆవేదన మిగుల్చుతుంది.
ఏదేనులో హవ్వకు ....
*పండు అందముగా కనిపించింది.
*తింటున్నప్పుడు ఆనందాన్నిచ్చింది.
*తిన్నాక ఆవేదన మిగిల్చింది.
అది సృష్టి ఆరంభములో మొదలై ఆ వేదన నేటికి కొనసాగుతుంది.

దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది.
* బత్షెబచూపులకు అందముగా కనిపించింది.
* ఆమెతో పాపం ఆనందాన్నిచ్చింది.
*తర్వాత ఆవేదన మిగిల్చింది.

ఆవేదన:
*పుట్టిన బిడ్డ చనిపోయాడు.
*పిల్లలు వ్యభిచారులయ్యారు.
*పిల్లలు హంతకులయ్యారు.
*కన్నకొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు.
*కనీసం చెప్పులు లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది.
*కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడా, నరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటే, మౌనముగా తల వంచాల్సి వచ్చింది.
*దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు.
ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో!

కారణం:
1.పొరుగు వాని భార్యను ఆశించడం ద్వారా 10వ ఆజ్ఞను మీరి,వ్యభిచారిగా మారాడు.
2.ఆమె భర్తను చంపించడం ద్వారా నరహంతకుడయ్యాడు.

*ఇంతకీ ఎవరీ దావీదు?
దేవుని చేత
"నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు.

*గోల్యాతుపై విజయం దావీదుకీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళితే,
బత్సేబతో పాపం దావీదును పతనం అంచులకు తీసుకొని వచ్చింది.

ప్రవక్త నాతాను వచ్చి
" ఆ మనుష్యుడవు నీవే" అంటూ దావీదు పాపం బయటపెట్టాడు. అప్పట్లో టి. వి చానల్స్ లేవు కాబట్టి దావీదు బ్రతికిపోయాడు అనుకొంటున్నావా?
ఉంటే,10 చానెల్స్ కవర్ చేసేవేమో? కాని దేవుడు దావీదు పాపాన్ని 2000 భాషల్లోకి తర్జుమా చేయించాడు.

దేవుడు పాపివైన నిన్ను ప్రేమిస్తాడు గాని, నీ పాపాన్ని ఎప్పటికి ప్రేమించడు,
సహించడు.

అదెట్లా సాధ్యం?
మన ఇంట్లో ఎవరయినా  కాన్సర్ తో
బాధపడుతుంటే, ఆ రోగిని ప్రేమిస్తాం, కాని ఆ కాన్సర్ ని ప్రేమించం. అట్లా ....

ఏ పాపం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుందో?
ఏ పాపం నిన్ను పట్టి పీడిస్తుందో?
ఏ పాపం నీకు ఆవేదన మిగిల్చిందో?
ఆ పాపాన్ని కప్పుకోక, సిలువ చెంత ఒప్పుకో!
నీ జీవితంలో ఎన్నాడులేని శాంతిని, సమాధానాన్ని అనుభవించు.

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.