Nannakarshinchina ni sneha bamdham నన్నాకర్షించిన నీ స్నేహబంధం

Song no:

    నన్నాకర్షించిన నీ స్నేహబంధం - ఆత్మీయ అనుబంధం (2)
    ఆరాధన - నీకే యేసయ్యా (2)
    నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) {నన్నాకర్షించిన}

  1. మహా ఎండకు కాలిన అరణ్యములో
    స్నేహించిన దేవుడవు నీవూ
    సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా..
    చేరదీసిన ప్రభువా.. (2)
    నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం- అనురాగ సంబంధం

  2. చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
    ప్రేమించిన నాధుడవు నీవే
    సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా
    జీవమిచ్చిన ప్రభువా.. .(2)
    నన్నాకర్షించిన నీ స్నేహ బంధం - ఆత్మీయ అనుబంధం

Blogger ఆధారితం.