Naa thalampantha neeve yesayya నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా

Song no:
    నా తలంపంతా నీవే యేసయ్యా
    నే కోరేదంతా నీతోడేగదయ్యా
    ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ
    నీ సేవయే నా భాగ్యం యేసయ్యా || నా తలంపంతా ||

  1. అణువణువు నా ప్రాణమంతా
    వేచియున్నది నీకై నిరతము
    నీవే నాదు సర్వము ప్రభువా || నా తలంపంతా ||

  2. నిన్ను ఎరుగక నశించిపోతున్న
    ఆత్మల భారం నాలో రగిలే
    నీకై నేను ముందుకు సాగెద || నా తలంపంతా ||

  3. నలిగిపోతుంది నా ప్రియ భారతం
    శాంతి సమాధానం దయచేయుమయా
    రక్షణ ఆనందం నింపుము దేవా || నా తలంపంతా ||



Post a Comment

కొత్తది పాతది