ఇంతలోనే
కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన
దానికా ఆరాటం
త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని
నీటివంటి
స్వల్పమైనదానికా
పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది
కాదు నీ సొంతం
దాటిపోవును
ఇల నీ సంపదలన్నియు
(2) ||ఇంతలోనే||
బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను
భువినేలిన రాజులు (2)
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక
నీది అన్న దేహమైన వచ్చునా
||ఇంతలోనే||
మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
ఆశ్రయించు
యేసుని అనుకూల సమయమున
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు
నిన్ను శాంతితో
||ఇంతలోనే||