Parama pavanudu

పరమ పావనుడు

పల్లవి: పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2x)

మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ

అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం ||పరమ||

1. దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ (2x)

వినరండి బాల యేసుని దివ్యగాథను

కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును ||పరమ||

2. తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2x)

అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ ||పరమ||

Post a Comment

أحدث أقدم