ప్రభు ప్రేమ తొలికేక

674

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ప్రభు ప్రేమ తొలికేక హృదయంలో ప్రతిధ్వనియించే పాపక్షమా యేసునిలో శరణు నొసంగుచు కనిపించేపాపవికారము పొడసూప జీవితవిలువలు మరుగాయె ఫలితముగా లోకములో బ్రతుకుటయే నాగతియాయె పలువురిలో కనబడలేకా దాహముతో నేనొంటరిగా బావికని పయనింప నాదుని దర్శనమెదురాయే పావనుడు దాహముతో జలమును ఇమ్మని ననుగోరె ||ప్ర||

  1. జాతిని చూడని నేత్రముతో పాపము శోకని హృదయముతో జాలిని చాటించుచునే తాకెను నామది వేదనతో జాప్యము చేయక తెమ్మనియే దాచుకొనిన నాపాపమును జడియచునే తెలిపితిని ప్రభు వెరిగిన నా నిజస్థితిని జయమొందె నాతనువూ సరిగ నుడితవని ప్రభు తెలుపాదేహమునే నాసర్వముగా భావించుచు మది పూజింపా దినదినము జీవితమూ చావుగ మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణప్రవాహము చేధించి దరిజేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును స్తుతి మందిరముగ రూపించే ||ప్ర||

  2. పాపము దాగును నాబావి లోతును చూచినదెవరు పోరాటవాటికయౌ నా బ్రతుకును ఎరిగినవారెవరు పాపికిని పాపమునకునూ భేదము చూపిన వారెవరూ పాపిని కాపాడుటకు సిలువను మోసిన వారెవరూ ప్రకటించె దైవకృప తెరచెను జీవన జలనిధులు ||ప్ర||

  3. ఘటముతో వెడలితి నొంటరిగా పితరుల త్రానజనములకై కనబడెను బావికడ రక్షణయూటల ప్రభుయేసు కుండను వ

Post a Comment

కొత్తది పాతది