thalli odilo pavalimche

తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా - 2
1. వేదన లేదు శోధనలేదు - నీ హస్తము విడువనయ్యా - 2
భయమన్నది లేనే లేదు - ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి
2. నీ ఉపకారం స్మరియించి - స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను.
చేయివిడువని నా యేసయ్యా - కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా.
3. మంచికాపరి జీవకాపరి - హృదయా పాలకుడా నా హృదయ పాలకుడా
ఆహారమై వచ్చితివా - ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలిసితివా.
4. నిన్ను నేను పట్టుకొంటిని - భుజముపైన సోలెదను నీ భుజముపైన సోలెదను.
నీ రెక్కల నీడలోనుండి - లోకాన్ని మరచితిని ఈ లోకాన్ని మరచితిని
5. రేయింపవలు వెతికానయ్యా - నీకై వేచితిని నే నీకై వేచితిని
నా జీవితకాలమంతా - నీ నామం చాటెదను నే నీనామం చాటెదను

Post a Comment

أحدث أقدم