Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Documentation
Index
అ
C
బంగారు బొమ్మ నీవమ్మా వధువు సంగమా రావమ్మా ||2||
శృంగార ప్రభువు యేసమ్మా వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మా ||2||
ప్రత్చ్సాతపమే పెళ్లి చూపులమ్మా
పాప క్షమాపనే నిర్చితార్ధమమ్మా
విరిగిన మనస్సు వరుని కట్నమమ్మా
నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
గొరియ పిల్ల రక్తములో తడిసిన
పవిత్ర కన్యవై నిలిచేవమ్మా } 2
|| బంగారు బొమ్మ ||
కొరడా దెబ్బలే పెళ్లి నలుగమ్మా
అసూయా ద్వేశాలే సుగంధ ద్రవ్యమమ్మా
నెత్తుటి దారాలే పెళ్లి చీరమ్మా
ముళ్ళ కిరిటమే పెళ్లి ముసుగమ్మా
ప్రకాశమయమై నిర్మలమైన
పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా } 2
|| బంగారు బొమ్మ ||
కల్వరి కొండే పెళ్లి పీటమ్మా
దేవుని దూతలే పెళ్లి సాక్షులమ్మా
సిలువ దండమే పెళ్లి సూత్రమమ్మా
దూషణ హేలనే పెళ్లి అక్షింతలమ్మా
సువర్ణమయమై స్వచ్చమైన
స్పటికమువోలే మెరిసేవమ్మా } 2
|| బంగారు బొమ్మ ||
|| ||
Song info
Writer ✍ :
Pandu Premkumar
Album 📀 :
Chintha Ledhika
Singers 🎤 :
S.P.Balasubrahmanyam
Book 📖 :
Music 🎵 :
Y.P.Prasad
Prabhudeva Ministries
Text sizes
Small size:ex:-Mobile
Medium sizes ex:- System,Tv's
Large sizes ex:-Wall screen,Projector
Contact form