570
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మొదట పరముని నంతునియ్యరే సదమల హృదయంబుతోడ సదయు డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్ ||ఇయ్యుడి||
- శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు శక్తికొలది నియవలెను ||ఇయ్యుడి||
- కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్ ||ఇయ్యుడి||
- సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి||
- యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె ||ఇయ్యుడి||
- పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి ||ఇయ్యుడి||
إرسال تعليق