దశము భాగము లెల్ల దేవునివి

571

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుడి పశువులు పైరులు దేవునివి పసిడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుడి ||దశమ||

  1. దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది నెంచి భయము నెంచి ప్రార్ధింప దలవంచి ప్రభు భాగమున్ దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుడీ ||దశమ||

  2. పరిశుద్ధ దేవుని మందిరము పరిపూర్ణముగాను యోచించుడీ పరిశుద్ధ భాగము విడదీయుడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు దేవునివి పరమాత్మ దీవెనలను బొందుడీ ||దశమ||

  3. ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుడీ సదమల హృదయములను బొందియు ప్రథమ భాగము నెల్ల విడదీసియు ముదమున దేవునికర్పించుడీ సదయు దీవెనలొంద సమకూర్చుడీ ||దశమ||

  4. ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబు దొలగింతును మీ కానంద దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||

  5. దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||

Post a Comment

أحدث أقدم