దేవర బ్రోవుమా దీన కుటుంబమున్

514

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని నడుపుమా ||దేవర||

  1. పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ ||దేవర||

  2. యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున నిలువుమ ||దేవర||

  3. అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ ||దేవర||

  4. పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున గావుమ ||దేవర||

  5. అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను గొలుతుము దేవ ||దేవర||

  6. నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము ||దేవర||

  7. క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ ||దేవర||

Post a Comment

أحدث أقدم