మేలుకొని యిక లేచి యేసుని మేలులన్

522

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా చాలా పాడరే వేలపాడరే ||మేలు||

  1. పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా ||మేలు||

  2. అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా ||మేలు||

  3. తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా ||మేలు||

  4. జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా ||మేలు||

  5. నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన మొసంగను సతత మాతని దాపున న్వసియించుమా తగ జీవించుమా ||మేలు||

Post a Comment

أحدث أقدم