552
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు జూచి స్తోత్రగీతముల్ పాడరే ||బాల||
- గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు రక్షణంబని యంతటను చాటించరే ||బాల||
- జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు మానవుండై బుట్టెను ||బాల||
- భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు ప్రభు మన మధ్యనే జన్మించెను ||బాల||
- లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు శ్రీ లొసంగగ వచ్చెను ||బాల||
إرسال تعليق