Song no: #63
-
పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ వరస్తుతి సల్పెదము రాజ
- జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు ||పరమ||
- నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు వారిఁ బావనులఁ జేయు సదా ||పరమ||
- కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ||
- ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై తానును బడఁద్రొక్కివేయు ||పరమ||
- అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా కరుణించు మమును ||పరమ||
إرسال تعليق