Song no: HD యేసయ్యా ....... } 4 ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను } 2 || ఎలా మరువగలనయ్యా || యేసయ్యా ....... } 4 ఆత్మీయులే నన్ను ఆదరించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు } 2 ఆదరించావు ప్రేమించావు } 2 అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు } 2 అందుకే || ఎలా మరువగలనయ్యా || అనాథగా నేను తిరుగుచున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు } 2 ఆదరించావు ఆకలి తీర్చావు } 2 అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు } 2 అందుకే || ఎలా మరువగలనయ్యా || బంధువులే నన్ను ద్వేషించినారు సొంత తల్లిదండ్రులే వెలివేసినారు } 2 చేరదీసావు సేదదీర్చావ…
Social Plugin