Yem chesanayya neekosam e brathukunicchavani ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని

ఏం చేసానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని (2)
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2)
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా||
ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||
ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా ||
ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||
أحدث أقدم