Sthothrarpana sthuthi arpana స్తోత్రార్పణా స్తుతి అర్పణ చెల్లించుడీ యేసుకే భజియించుడీ యేసునే


Song no: 10
స్తోత్రార్పణా స్తుతి అర్పణ
చెల్లించుడీ యేసుకే
భజియించుడీ యేసునే
ఆయనే - యోగ్యుడు
ఆయనే - ఆర్హుడు

1. సర్వ సృష్టికి ఆది సంభూతుడు
    సమస్తమునకు ఆదారభూతుడు
    వాక్యమై యున్న యేసయ్యా
    సృష్టి కాదారము యేసయ్యా
 
2. సమీపింపరాని తేజస్సు నందు
    నిరతము వశియించు
    అమరుండు యేసే
    వెలుగుగ యున్న యేసయ్యా
    వెలిగింప వచ్చెను యేసయ్యా

3. మానవాళికి మోక్ష ప్రధాత
    సర్వ పాప విమోచకుడు
    మార్గమై ఉన్నాడేసయ్యా
    జీవమై ఉన్నాడేసయ్యా

أحدث أقدم