الصفحة الرئيسيةBilmoria 🎤 ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా byOnline Lyrics List —فبراير 17, 2024 0 186 సిలువపై క్రీస్తుని ప్రేమ రాగం - నాధనామక్రియ తాళం - కురుజంపె ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా || ఏ పాప || కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా || ఏ పాప || చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా || ఏ పాప || ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా || ఏ పాప || పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా || ఏ పాప || బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము || ఏ పాప || కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి || ఏ పాప || Ye Paapamerugani Yo Paavana Moorthy Paapa Vimochakundaa Naa Paali Daivamaa Naa Paapamula Kora Kee Paatlu Nondinaavaa Mullatho Kireeta – malli Nee Shiramupai – Jallaatamuna Moththiraa Mulla Potlaku Shiramu – Thalladillaga Somma – sillipothiva Rakshakaa || Ye paapa || Kaluvari Giri Danuka – Siluva Moyaleka – Kalavaramu Nondinaavaa Siluva Neetho Moya – Thuluvalu Verokani – Thodugaa Nichchinaaraa || Ye paapa || Chedugu Yoodulu Bettu – Padaraani Paatlaku – Sudivadi Nadachinaavaa Kadaku Kalvari Giri – Kada Kegi Silvanu – Grakkuna Dinchinaavaa || Ye paapa || Aa Kaala Karmulu – Bheekarambuga Ninnu – Aa Koyyapai Nunchiraa Nee Kaalu Sethulu – Aa Koyyake Soodi – Mekulatho Gruchchinaaraa || Ye paapa || Paluvidhambula Shramalu – Chelarega Dandriki – Nelugeththi Moralidithivaa Siluvapai Palumaaru – Kaluguchundedi Baadha – Valana Daahamu Naayenaa || Ye paapa || Ballidundagu Bantu – Ballemuna Nee Prakka – Jilli Bada Bodachinaadaa Ullolamulavale Nalla Neerubukanga Jallaare Gada Kopamu || Ye paapa || Kata Kataa Paapa San – katamu Baaputa Kintha – Patu Baadha Nondinaavaa Etuvantidee Prema – Yetuvantidee Shaantha – Metula Varninthu Swaami || Ye paapa ||