Nimittha mathrudanu nirmanakudavu nivayya నిమిత్త మాత్రుడను నేనయ్యా నిర్మాణకుడవు నీవయా


Song no: 11
నిమిత్త మాత్రుడను నేనయ్యా
నిర్మాణకుడవు నీవయా
నిర్మించినావు నీదు రూపులో
ప్రేమించినావు ప్రాణముకన్న

ఎంత భాగ్యమయ్యా
నాకెంత భాగ్యము
ఎంత ధన్యతయ్యా నాకెంత ధన్యత

1. నాశనకరమగు
    గుంట నుండియు
    జిగటగల దొంగ ఊబి నుండియు
    లేవనెత్తినావు యేసయ్యా
    నన్ను నిలబెట్టినావు మెస్సియ్యా
 
2. చీకటిలో నుండి వెలుగులోనికి
    మరణములో నుండి
    జీవములోనికి
    నను దాటించినావు యేసయ్యా
    నను నడిపించినావు మెస్సియ్యా

3. బలహీనుడనైన
    నన్ను బలపరచావు
    ఆత్మతో అభిషేకించి     
    నడిపించావు
    నీ మహిమతో నను   
    నింపిపినావయా నీ పాత్రగ
    నను మలచినావయా
أحدث أقدم