Who is True God

తల్లి కన్నా , తండ్రి కన్నా ,గురువు కన్నా దేవుడే గొప్ప!!!!
ప్రభువు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయజేస్తున్నాను.
ప్రపంచములో ప్రతి వ్యక్తి యొక్క ప్రతిభను గుర్తించటానికి మొదటి స్థానము, రెండవ స్థానము and మూడవ స్థానము ఇలా బహుమతులు  ప్రధానము చేస్తారు. ప్రపంచములో అన్నిటికంటే , అందరికంటే ప్రధముడు దేవుడైయుండగా నేడు మనుష్యులు తల్లి , తండ్రి ,గురువు and దేవుడు అని దేవునికి బహుమతి లేనివానిగా చివరి స్థానానికి నేట్టివేసారు.  ఈ రోజు నాస్తికులు, ఆస్తికులు ,హేతువాదులు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడేవరు? దేవునిని ఎందుకు నమ్మాలి? తల్లి మించిన దేవుడు లేదు అనే స్థాయిలోనికి వెళ్ళిపోయారు. అందుకనే ఆది నుండి నేటి వరకు ప్రపంచములో అనేకులు దేవుడు ఉన్నాడా? లేడా? అను అనుమానాలతో ఉంటూనే ఉన్నారు.
2) దేవుడు కనిపించక పోయిన నమ్మే వారు ఒకరు. దేవుడు ఉన్నాడు అని అనుటకు సాక్షాలు కావాలని ప్రశ్నిస్తూ నమ్మనివారు మరొకరు. ఈ ఇరు వర్గాల నమ్మకాలలో ఎవరిది నిజము? దేనిని నమ్మాలి? అనే సందేహములో చచ్చిపోయే ముందు తెలుసుకోకుండా పరిశోధనలోనే బ్రతుకును ముగించుకోనుచున్నారు.
3) ప్రతి ప్రారంభానికి ఒక మూలము( starting point) ఉంటుంది. ఒక చక్కని building నిర్మించబడినది అంటే దానిని నిర్మించాలని ఎవరికో కలిగిన ఆలోచనకు రూపకల్పనే ఆ building. buildingనీ నిర్మించిన తరువాత కట్టిన పనివారు ఇంటి దగ్గర ఉండవలసిన అవసరత లేదు. కట్టిన వారు లేనంత మాత్రాన్న ఆ ఇల్లు దానికి అదే వచ్చింది అనుట వేర్రితనమే . సృష్టిని దేవుడు చేసాడు. సృష్టికర్తయైన దేవుడు మనకు కనిపించనంత మాత్రాన్న లేడు అనుట కూడా వేర్రితనమే అవుతుంది. ఈ రోజు మనిషిని సుఖపెట్టాలానే ఆలోచనలో scientists ప్రతి పదార్ధాన్ని పరిశోదిస్తున్నారు. ఇవ్వన్ని మనము ఒకసారి ఆలోచిస్తే ఈ 60 years జీవితానికి ఉపయోగపడుటకు మాత్రమే ప్రకృతిని పరిశిలిస్తున్నారు గానీ ప్రకృతిని కలిగించిన దేవునిని research చేసి తెలుసుకునే పరిశోధన కేంద్రాలు ప్రపంచములో కరువయ్యాయి.
4) ఏదైనా రెండు వస్తువులు పోల్చి చెప్పవచ్చు. ఇది ఎర్రగా ఉంది , తెల్లగా ఉంది, లావుగా ఉంది సన్నగా ఉందని కానీ 2000 వస్తువులిచ్చి భేదాలు చెప్పమంటే అది చాలా కష్టము. సృష్టిని కలిగించిన దేవుడు ఒక్కడై ఉండగా ఊరికొక దేవుడు , గ్రామానికి ఒక దేవత చొప్పున కోట్ల సంఖ్యలో దేవుళ్ళు సమూహము మనుష్యుల వలన వలసినప్పుడు దేవుడెవరో తెలుసుకోవాలంటే మనిషికి కూడా చాలా కష్టము.
5) దేవుడు మనిషికి కనిపించడు. అయన అద్రుస్యుడు. కనిపించని దేవుడు ఇతనే అని అయన రూపము ఎలా గిస్తాము????? దేవుడు మనిషిని చేసాడు కాని మనిషి  దేవుడిని చేయలేదు. తండ్రి కుమారుడిని కనగలడు కాని కుమారుడు తండ్రిని కనలేడు. కుమ్మరి కుండను చేస్తాడు కాని కుండ కుమ్మరివాడిని చేయదు. దేవుడు మనుషులను చేస్తే మనుషులు దేవుని చేసే స్థాయికి ఎదిగిపోయారు. దేవుడు ఒక్కడే అని ఖచ్చితముగా తెలుసుకుని ఆయనే దేవుడు అనే నిజనిర్ధారణకు వస్తే మన నమ్మకానికి ఒక అర్థము ఉంటుంది. వంశపారంపర్యముగా నమ్ముకున్నారు గనుక వారు నమ్మిన దేవుడినే పిల్లలు నమ్ముకుంటున్నారు. తండ్రి సూర్య నమస్కారము చేస్తే తన కుమారుడు msc చదువుతున్న  science student అయిన సూర్య నమస్కారము చేస్తాడు. సూర్యుడు ఒక star అనే సంగతి తెలిసిన దేవుడని పూజిస్తున్నారు. చంద్రుడు దేవుడు కాదని అది ఒక చౌడు నేల అని 1969 yearలో neil armstrong చెప్పినంత వరకు చంద్రునిని దేవునిగానే పుజించినవారు లేకపోలేదు . వంశపారంపర్యముగా పూజించుట habit అయింది కాని  నిజనిర్ధారనతో, రుజువులతో ఇతనే దేవుడు అని ఏ మనిషికి పరిశోధించి తెలుసుకోవాలనే ఆశ గానీ, ఆలోచన గానీ లేదు.
6) దేవునిని తెలుసుకోవాలనే వ్యక్తికి research mind అవసరము.  అంతేకాని ఏ దేవుడైన ఒక్కటే అని adjust అవ్వకుడదు. ఏ అడ్రస్ వ్రాసిన problem లేదు మా ఇంటికే letter వచ్చేస్తుంది అని అంటారా??? ఏ పురుషుడైన ఫరవాలేదు అయన నా భర్త అని adjust అవ్వగలరా?????? కానీ ఏ దేవుడైన ఫరవాలేదని సర్డుకుపోయారంటే మనుష్యులు దేవునిని విలువలేని వానిగా భావించారు.  దేవునిని తెలుసుకోవాలనుకున్న వారు ఎవరైనా తగిన ఆధారాలతో దేవునిని తెలుసుకుని , నేను నమ్మిన దేవుడు దేవుడేనా? నేను నమ్మిన దేవుడు నా కంటే నీచముగా ఉన్నడా?? అని పరిశిలించండి. దేవుడు అనే పేరు పెట్టుకున్న వారికీ ఎవరైనా character ఉండాలని అలోచించి ,పరిశిలించి తెలుసుకుని నేను నమ్మిన దేవుడు దేవుడే అని నిరుపించండి. ఒక fruits అమ్ముకునే వాడు మన విధిలోనికి వచ్చినప్పుడు ఆ పండు మీరు తిని రుచి చూచి బాగుంటే డబ్బులు ఇచ్చి కొనండి అని, తిన్నదానికి డబ్బులు అవసరము లేదని అంటాడు. అంటే తను అమ్ముకుంటున్న సరుగు మంచిది అని చెప్పడానికి ఆ పండును మనతో తినిపించి ఎంత చక్కగా ఒప్పించి, నిరుపిస్తున్నాడో చూసారా?????? మీరు నమ్మిన దేవుడు  నిజముగా దేవుడే అయితే నిరూపించి ఒప్పించండి.
7) దేవునిని ఎందుకు నమ్మాలో అని తెలుసుకోకుండా ప్రపంచములోని వారంతా దేవునిని కేవలము అవసరాల కోసము నమ్మారు. 60 years బ్రతికే ఈ చిన్న జీవితములో ఆపదలో అదుకోనేవాడేనా దేవుడు?????? ఇక మరేమీ కాడా??? చనిపోయిన తరువాత దేవుడు అవసరము లేదా??? మనము పుట్టక ముందే ఈ మహా సృష్టిని కలిగించి అందులో మనము త్రాగడానికి నీరు ,ఉపిరి పిల్చుటకు గాలి , కళ్ళతో చూడడానికి రంగు రంగుల ప్రకృతి,  ఒక్క కాయతో, ఒక్క పండుతో మనము adjust అవ్వలేమని మన నాలుక రుచి ఎరిగి మనకు ఇదే ఇష్టమని నీ మనస్సు తెలుసుకుని రకరకాల రంగులతో,ఆకారాలతో,రుచులతో లెక్కలేనన్ని ఆహార పదార్ధాలు చేసినది ఎవరు????????మన కోసము ఎన్ని ఎందుకు చేయాలి?????మనము ఆయనకు ఏమి అవుతాము????అని ఎప్పుడైనా ఆలోచించామా??? బట్టలు, బంగారము, బండి ,సబ్బు ఏది కొనుక్కున అది made in china లేక india అని వాటి తయారీ ఎక్కడ, ఎవరు చేసారు అని తెలుసుకునే మనము మనల్ని ఎవరు చేసారు అని ఆలోచించామా??? మనము అనుభవిస్తున్న భూమి ,నీరు, గాలి ఇవన్ని ఎవరు చేసారని తెలుసుకోవా???  ఏ పుట కూలి డబ్బులు ఆ పుట తెచ్చుకుని వండుకునే తిని బ్రతికే మనిషి కొరకు ఆకాశములో భూమి కంటే 13 లక్షల రెట్లు ఉండే అంత పెద్ద సూర్యుడు అవసరమా??
8) తల్లి ఆహారము వండిన తరువాత ఆహార పదార్ధలన్నిటి  మీద  మూతలు పెట్టినట్లుగా –మనము తినే బత్తాయి పండు మీద చక్కని మూత( తొక్క), అరటి పండు మీద మూత , చివరికి చిన్న వేరుశనగ పలుకులకు కూడా చిన్న మూత దేవుడు పెట్టాడు. మార్కెట్ లో టమోటా చూడగానే పప్పులో వేయాలా లేక పచ్చడిలో వేయాలా అనే ఆలోచిస్తామే తప్ప ఇంత రుచిగా ఎవరు చేసారు అని think చేయము.  ఆ కనిపించని దేవుడు ఎవరు? నా కోసము ఈ ప్రకృతిని ఎందుకు చేయవలసివచ్చింది?? ఆ దేవునికి మనము ఏమి అవుతాము?? అని తెల్సుకోవాలనే ఆశ లేదా???
9) పది నెలల పసి బిడ్డను ఎవరైనా ఎత్తుకుంటే ఏడుస్తుంది. కారణము ఎత్తుకున్న వారు తన తల్లి, తండ్రి కాదని తెలుస్తుంది. 10 నెలల పసిబిడ్డ తన తండ్రి ఎవరో తెలుసుకుంటుండగా మనిషికి 20 years వచ్చిన 60 years వచ్చిన ఈ సృష్టిని సృష్టించిన దేవుడే ఆత్మలకు కన్నా తండ్రి అని తెలుసుకోనకపోవుట విచారకరము.  ఒక కుటుంబానికి ఒక తండ్రినే ఉంటాడు కాని తండ్రులు ఉండరు. ఒక familyలో నలుగురు sons and 3 daughters ఉన్నంత మాత్రానా తండ్రులు ఏడుగురా లేక జన్మ నిచ్చిన తండ్రి ఒక్కడేనా????? అలాగే భూమి మిధ ఉన్న మానవులందరికీ తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆ దేవునికి మనమంతా పిల్లలము గనుకనే దేవుడు సృష్టిలో ఉన్నవన్నీ మన కొరకు సృష్టించి freeగా ఇచ్చాడు.
10) మన పిల్లలకు బట్టలు కొని వాటిని వారికీ 1000 rupees అయ్యిందని వారిని money అడగము.ఫ్రీగా ఇస్తాము.కారణము వారు మన కన్నా బిడ్డలు. sun, stars, moon దేవుడు కలిగించి సుమారు 1500 crores years అయింది. వెలుగులో తేడా లేదు. కలాలలో తేడా లేదు.భూమి తను చుట్టూ తను తిరగడములో ఆలస్యము లేదు. tvనీ మనము remoteతో control చేస్తునట్లు ఈ అనంత సృష్టిని దేవుడే నడిపిస్తున్నాడు. కనుక ఇవి ఎంత వేగముగా తిరిగుతున్న danger లేదు. ఆ దేవుడు ఎవరో కాదు మన ఆత్మలకు తండ్రే.  ఆ దేవునినే నమ్మలే గానీ అవసరాలికి దేవుడు అని నమ్మకూడదు.  భాదలకు ,కష్టాలకు, ఆపదలకు దేవునిని నమ్మక ఆత్మలకు తండ్రి అని నమ్మాలి
11) భూమి మిద మీకు జన్మనిచ్చిన శరిర సంభంధమైన మన తండ్రిని మన తల్లి చెబితే నమ్ముతాము. జన్మనిచ్చిన కన్నా తండ్రిని అమ్మ చెబితే నమ్ముతున్న మనము కనిపించని దేవుడు ఉన్నాడని చెబితే నమ్మలేమా???? సృష్టికర్తయైన దేవుడు మన ఆత్మలకు కన్న తండ్రి అని తెలియజేసిన వ్యక్తి సామాన్యుడు కాదు. శక పురుషుడైన క్రీస్తు యేసు.
12) నేడు ప్రతి మనిషి ఫలానా year, month, date అని వెయ్యగాలుగుతున్నాడంటే దేనిని బట్టో తెలుసా?? క్రీస్తు అనే మహానుభవుడు పుట్టాడు గనుక. క్రీస్తు శకం ,క్రీస్తు పూర్వము అని కాలాన్ని divide చేసారు.ఎందుకు క్రిస్తునే తీసుకున్నారు??? క్రీస్తుకు ముందున్న వారు ఎవరు శకపురుషుడుగా గుర్తించుటకు సరిపోరా?????  ఈ లోకములో ఒక సామాన్యమైన వ్యక్తి నేను అమెరికా చూసి వచ్చానని చెబితే నమ్ముతారు.  ప్రపంచమంతా ఏకగ్రివముగా గుర్తించిన వ్యక్తి పరలోకము ఉందని,ఆ లోకములో ఉన్న దేవుడు మనకు తండ్రి అని , అయన ఉన్నవాడని చెప్పిన మాటలు నమ్మలేరా?? శకపురుషుడైన యేసుక్రీస్తు మాటలాడిన మాటలున్న  “THE BIBLE” ను  నమ్మలేరా?? అందులో ఉన్న మాటలు true గనుకనే ముద్రణ యంత్రము కనుగొన్న తరువాత ముద్రింపబడిన తొలి పుస్తకముగా historyకి ఎక్కింది.
13) దేవుడు లేడని నమ్మి, చచ్చిపోయిన తరువాత తీరా ఆ లోకానికి వెళ్ళాక దేవుడు ఉన్నాడని తెల్సితే ఆ స్థితి చాలా danger. ప్రతి మనిషికి దేహము విడిచిన తరువాతే తెలుస్తుంది అస్సలు నిజము. మనము ఉంటున్న ఈ లోకము ఉన్నది అని పుట్టిన తరువాతే తెలిసింది. ఈ లోకము ఉందని తెలుసుకోవాలంటే పుట్టాలి. మరొక లోకము ఉందని తెలియాలంటే చావాలి. మరణమే ముగింపు అని అనుకుంటే ఒక విత్తనము మట్టిలో పది చచ్చి బ్రతికి మరో బ్రతుకుందని తెలుపుతుంటే విత్తనము కంటే గొప్పవాడైన మనము మరణించిన తరువాత మరో లోకములో మరో బ్రతుకుందని తెలుపుటకే క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను.

Post a Comment

أحدث أقدم