Vandhanalayya Vandhanalayya Vandhanalayya lyrics


వందనాలయ్యా- వందనాలయ్యా
వందనాలయ్యా- నీకే వందనాలయ్యా
యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయ్యా
వందనాలే.....వందనాలే......వందనాలే
1. ఇంత వరకు కాచినావు నీకు వందనాలయ్యా
ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా
అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా
నాన్న వలే నన్ను లాలించినందుకు వందనాలయ్యా ( వందనాలే)
2. కట్టుకొనుటకు వస్త్ర ములిచ్చావు వందనాలయ్యా
భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా
ఉండుటకు నివాసము ఇచ్చావు వందనాలయ్యా
అన్ని వేళలో ఆదుకున్నందుకు వందనాలయ్యా వందనాలయ్యా ( వందనాలే)
3. వ్యాధి బాధలలో నెమ్మది నిచ్చావు వందనాలయ్యా
హస్తము చూపి స్వస్థపర్చినావు వందనాలయ్యా
పరమవైద్యుడా యేసయ్య వందనాలయ్యా
మా ఆప్త మిత్రుడా యేసయ్య వందనాలయ్యా వందనాలయ్యా ( వందనాలే)
4. ఏడ్చినపుడు ఓదార్చి నావు వందనాలయ్యా
కన్నీళ్ళు తుడిచి కౌగలించినావు వందనాలయ్యా
చెయ్యి పట్టి నడుపుచున్నందుకు వందనాలయ్యా
పరమ తండ్రి నా యేసయ్య వందనాలయ్యా వందనాలయ్యా ( వందనాలే)

Post a Comment

أحدث أقدم