Chekkumaya nannu nee polikalo చెక్కుమయ్యా నన్ను నీ పోలికలో

Song no:
    చెక్కుమయ్యా నన్ను నీ పోలికలో
    నడుపుమయ్యా నన్ను నీ ఏలికలో } 2
    శిల్పకారుడా స్వల్ప జీవితం } 2
    మలచుము నన్ను నీ అనుకూలముగా} 2 || చెక్కుమయ్యా ||

  1. మరణపాత్రమైన ఈ నా జీవితం
    మహిమ రాజ్యము చేర్చుకొనుటకు } 2
    మార్చుము నన్ను నీ పోలికలో
    మెరుగుదిద్దుము నన్ను నీ హస్తముతో } 2 || చెక్కుమయ్యా ||

  2. మిగిలిపోయిన ఈ నా జీవితం
    మస్టు పోవునట్లు పుటము వేయుము } 2
    పరిపూర్ణ స్వారూప్యము కనబడు వరకు
    తీర్చి దిద్దుము నన్ను జీవ వాక్యముతో } 2 || చెక్కుమయ్యా ||




Song no:



Post a Comment

أحدث أقدم