Naa korakai anniyu chesenu yesu

నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో (2)
నా కొరకై అన్నియు చేసినందులకు (2)
నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2)       ||నా కొరకై||

క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2)       ||నా కొరకై||

ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయవు (2)
వాటిని పోషించునట్టి పరమ పితా (2)
మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2)       ||నా కొరకై||

ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము (2)
అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2)
తానె – నిశ్చయముగా అలంకరించును (2)       ||నా కొరకై||

రేపటి దినము గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2)
రేపు దాని సంగతులనదే చింతించున్ (2)
ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2)       ||నా కొరకై||

ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2)       ||నా కొరకై||

Post a Comment

أحدث أقدم