Yedabayani needhu krupa vidanadani



ఎడబాయని నీదు కృప విడనాడని నీ ప్రేమ (2)
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)
నన్ను బలపరచెను నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)       
||ఎడబాయని||
కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా (2)      
||నన్ను బలపరచెను||
నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే (2)      
||నన్ను బలపరచెను||
నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా (2)      
||నన్ను బలపరచెను||


أحدث أقدم