81
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
దివ్యపదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు ||భజన||
నరుల గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుడ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన||
చెడినవాడ నైన నన్ను జేరదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తి నావు ||భజన||
ఎంత ప్రేమ యెంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబుకాదు ||భజన||
إرسال تعليق