a85

85

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    చేరికొల్వుడి క్రీస్తుని పాదముల జేరి కొల్వుడి చేరి కొల్వుడి స్థిరమతితో మీ నోరు నిండ మది కోరిక దీర ||జేరి||

  1. ధీరకలితు డుప కారకు డిత డని యారూఢిగ మది గోరి ప్రియమున ||జేరి||

  2. జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి ఘనుని ||జేరి||

  3. సార చరిత్రో దారుడు పాతక ధీరుడు శుద్ధా చారుండితడని ||జేరి||

  4. దేవుని కొమరుడు ధీవిస్తారుడు సేవ కావనుడు క్షేమకరుండని ||జేరి||

  5. యేసుని వారల నీశుడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగాన ||జేరి||

  6. మరణము నొందిన నరులను గృప గ్ర మ్మర బ్రతికించిన మహిమోజ్వలుని ||జేరి||

  7. పలు దయ్యంబుల బారదరిమి రో గుల రక్షించిన మలినాపహుని ||జేరి||

  8. జను లచ్చెరు వొం దను మూగకు నో రును గన్నులు చీ కునకిడినా డని ||చేరి||

Post a Comment

أحدث أقدم