80
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱగ నిత్యజీవ కి రీటమును నీకిత్తు నని తన నోట బల్కిన మాట దప్పడు||యేసు||
ఖండనగ నిను చెండియాడడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతడితడు అండబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిగ నీకుండ జెప్పును||యేసు||
లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు ఏక మనసుతో రాత్రిబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసగును||యేసు||
వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తల ద్రుంచి ప్రభుని సేవింపనే మనసా అంచితముగా క్రీస్తు డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా||యేసు||
నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారు డై వెలసి ఎన్నగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా||యేసు||
إرسال تعليق