a79

79

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు||

  1. యేసు త్రిత్వమం దీశ కుమారుడు భాసురు డాతడు భూషిత రక్షకుడు ||శ్రీ యేసు||

  2. నరుల దురితస్థితి గరుణించి వారికి పరమ సుఖము లిడ పరికించి వచ్చిన ||శ్రీ యేసు||

  3. స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడి బుట్టిన ||శ్రీ యేసు||

  4. నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేడెడి నిజప్రాపకు డగు ||శ్రీ యేసు||

  5. మూడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము నొందిన ||శ్రీ యేసు||

Post a Comment

أحدث أقدم