76
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం||క్రీస్తు||
జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు ప్రేమజూపిన అమరతేజుడ మంగళం||క్రీస్తు||
ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం||క్రీస్తు||
మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం||క్రీస్తు||
జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం||క్రీస్తు||
إرسال تعليق