443
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- అడకువతో నీ పాదములబడి యొడయుడా నావెల్ల నీకిడి తడవు చేయక కొల్తు నిన్ను దండ్రి నన్నంగీకరించుమి ||శ్రీ||
- నీవు నా రాజువు నిరతము నేను నీ బిడ్డను నిశ్చయము పావనాత్ముని యెదుట నాదు జీవ మిడుదు సజ్జీవనముకయి ||శ్రీ||
- ప్రభువరా యర్పించుకొందు భక్తితోడ నన్ను నిందు శుభప్రదము లగు శక్తులతో నను సొంపుమీరగ నింపు స్వామీ ||శ్రీ||
- మహిమస్తుతులు చెల్లు నీ నా మంబునకు నిత్యంబుగా న న్నిహ పరంబు బ్రోచువాడ నీవె సుమ్మా లోక రక్షకా ||శ్రీ||
إرسال تعليق