a442

442

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||

  1. ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||

  2. అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||

  3. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||

  4. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||

  5. మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||

  6. పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||

Post a Comment

أحدث أقدم