a441

441

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహు ధైర్య మొందెద ||నావన్ని||

  1. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||

  2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని నిత్యంఉ గరముల నీ సేవ జేసెద ||నావన్ని||

  3. నీ సేవ జరిగెడు నీయాలయమునకు నాసచే నడిపించు మరల నా పదములు ||నావన్ని||

  4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త గదలక ప్రకటింప గలి గించు దృఢ భక్తి ||నావన్ని||

  5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమీ యావంతయైనను నాశింప మదిలోన ||నావన్ని||

  6. నీవు నా కొసగిన నిర్మల బుద్ధిచే సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని||

  7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్లకుండగ మార్గంబు దెలుపుము ||నావన్ని||

  8. హృదయంబు నీ కిత్తు సదనంబుగావించి పదిలంబుగా దాని బట్టి కాపాడుము ||నావన్ని||

Post a Comment

أحدث أقدم