a439

439

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా ||సంపూర్ణ||

  1. నిర్మల మనసు రంజిల్ల నిత్య పరమానందంబు నా యాత్మలో నెరపు ధరణి శ్రమల నోర్పు నిమ్ము పాప పరితాప మనుదినం బభివృద్ధిపరచి ||సంపూర్ణ||

  2. విశ్వాస సమృద్ధి నిమ్ము నాదు ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం తోషంబుగ సేవించుటకు నీదు నాశీస్సు దయచేయు దాస పోషకుడా ||సంపూర్ణ||

  3. నాలో గృతజ్ఞత నింపు నన్ను బాలించు ప్రభునికై బ్రతుకంగ నిమ్ము చాల తనదు మహిమ బొగడి సర్వ కాలంబు దన వాక్కు గని పెట్టునట్లు ||సంపూర్ణ||

  4. నా పాపములె యేసునాధున్ ఘోర తాపా నిర్యాణంబు లందింప జేసెన్ నా పాపములకు దుఃఖింతున్ దేవ కాపాడుమీ నన్ను బాపంబునుండి ||సంపూర్ణ||

  5. పెక్కంత శుద్ధిని బొంది నేను ఇక్కట్లు నోడింప శక్తి నందిమ్ము చిక్కుల బడి యుండునపుడు నీతి లోకమం దా సక్తి మిక్కుట పరచి ||సంపూర్ణ||

  6. నీ రాజ్య ప్రవేశ మంది తండ్రి యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము యేసు ధరణి నీవలె నేను వర్తించునట్లు ||సంపూర్ణ||

Post a Comment

أحدث أقدم