420
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యేసుని కరుణ యిదే మాకు శర ణని యాసతో నమ్మిన యధముల కెల్ల ||యేసు||
- ఎన్నిక సేయక యే పాపి నైనను మన్నించి బ్రోచెడు మా దేవుడైన ||యేసు||
- పశ్చాత్తాపము నొందు పాపుల నెల్లను నిశ్చయముగ బ్రోవ నిపుణు డై యున్న ||యేసు||
- దిక్కు లేకున్నటి దీన జనాత్ముల జక్కగ బ్రోచెడు సదయు డైయున్న ||యేసు||
إرسال تعليق