422
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పచ్చిక చోట్లలో బండ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకు జక్క గా నడిపించు ||యెహోవా||
- ఆయన దయతో నా యా యాసముల దీర్చి న్యాయమార్గములందు నను బట్టి నడిపించు ||యెహోవా||
- గాడాంధకార మా ర్గమున నే దిరిగినను గాఢంపు గృపతోడ గరుణించు నన్నెపుడు ||యెహోవా||
- నీవు తోడై యుండ నిర్భయం బగు నాకు కావవచ్చును దుడ్డు కఱ్ఱయును దండంబు ||యెహోవా||
- నా శత్రువుల నడుమ నాకు భోజన మొసగి యాశ తీరంగ ద లంటె నూనెను బోసి ||యెహోవా||
- నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా దయలు వెంటాడు ||యెహోవా||
- పరమానందముతోడ బ్రభు సన్నిధానమున పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు ||యెహోవా||
إرسال تعليق