419
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- జీవబాధ నే దాటుదాక నన్ను నీవె దాచము నా రక్షక రూపునకు నడ్పి ప్రోవు మో యేసు దేవ యాత్మను జీవమును జేర్చు ||యేసూ||
- ప్రాపు లేని నా యాత్మన్ నీవు నీదు దాపునకు జేర్చి ప్రోచి కావు మో పరమాత్ముడా యోపికతో జూచి యాపదల బాపి యాదరించుము ||యేసూ||
- నా నమ్మకము నీ యందున్నది నీలో నేను గోరు సాయంబున్నది గాన నే బ్రాపు లేని నా తలను బూని రెక్కల లోన గప్పుము ||యేసూ||
- యేసు నీవే నాకు సర్వము నీదు దాస జనుల లేవనెత్తుము నీ సుబల మిమ్మో యేసు రోగులకు వాసిగా జీకు వారలను నడ్పి ||యేసూ||
- నా వంటి ఘోరపాపి యేడి యేసు నీవంటి పరిశుద్ధు డేడి కేవలము సత్య భావముతో నిండి నీవు కృపగల దేవుడవు స్వామి ||యేసూ||
- నీదు కృపా బాహుళ్యమందు యేసు నాదు పాపము గప్పుకొందు సాదరం బగు నీదు మాటల మోదమున శుద్ధి పాదుకొననిమ్ము ||యేసూ||
- నీవు నిత్యజీవపు టూటవు నాకు జీవజలంబు నిచ్చి కావు మీపు నా యెదలో గావగ లేచి జీవపదవికి ద్రోవ దీయుమా ||యేసూ||
إرسال تعليق