418
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మది మీకిడుదునని పరమరక్షకు డాన తిచ్చెను ||ముక్తి||
- ఇచ్ఛయించెడు వాడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చు కొనుగా కనుచు బల్కెను సచ్ఛరితుడు మనుష్య పుత్రుడు ||ముక్తి||
- ఆకసమునందుండి యిటు దిగి లోకమునకు జీవము నొసగునది ఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము ||ముక్తి||
- నేనె మార్గము నేనె సత్యము నేనె జీవము నావలననే గాని యెపడును తండ్రి యొద్దికి రానలవిగాదని వచించెను ||ముక్తి||
- జీవజలము నుద్రావుటకు మీ భావన లనెడి పాత్ర ముంచుచు చేవ గొని పానించుచు నిరత జీవమును వెలుఃగొంది బ్రతుకను ||ముక్తి||
- ఎక్కడను యిటువంటి ప్రభువును మక్కువను వేసారి వెతకిన చిక్క(బో డిటువచ్చి జూడుడి గ్రక్కునను జేసట్టు డిప్పుడే ||ముక్తి||
إرسال تعليق