a16

16

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యెహోవా నా మొఱ లాలించెను దన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవా||

  1. పిశాచి గడిమిబడగొట్టెను దన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమునజేర్చి సేదదీర్చెను ||యెహోవా||

  2. మదావళము బోలు నామదిన్ దన ప్రదీప్త వాక్యాం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి జేర్చెను ||యెహోవా||

  3. అనీతి వస్త్ర మెడలించెను యేసునాధు రక్తమున ముంచెను వినూత్న యత్నమె ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రేమ నాకు జూపెను ||యెహోవా||

  4. విలాపములకు జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకిలాగి నను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను ||యెహోవా||

  5. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దా చక తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను ||యెహోవా||

Post a Comment

أحدث أقدم