15
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పచ్చికగల చోట్ల నను పరుండజేయుచు గడు హెచ్చగు సౌఖ్యములు సదా యిచ్చు నాతడే||
శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు విభుడు అతడే||
గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిక నా తోడు ఆయనే||
దుడ్డుకఱ్ఱతో శత్రువుల దరుమగొట్టుచు దన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు||
అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతో గడు విందు లొసగి తృప్తిపరుచు విభుడు ఆయనే||
ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుడు నాకు బూయుచుండు సకల వేళలన్||
బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును||
إرسال تعليق