a17

17

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి పోకండి ||యెహోవా||

  1. యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము ||యెహోవా||

  2. యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలో జేసికొనకండి ||యెహోవా||

  3. జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలగక చెడిపోకండి భావించి యాత్మన్ వేడండి దేవ దేవుని నెడబాసి తెరవు విడకండి ||యెహోవా||

  4. మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన జెల్లుట దలచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన మున మరవక తలచి ||యెహోవా||

  5. కాయము నొసగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలో గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు నిపుడు కర్తకు నిచ్చి ||యెహోవా||

Post a Comment

أحدث أقدم