చేతులెత్తి వందనములు చేతు మిపుడే

532

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగ లందు మము బ్రీతితో గాపాడు యేసు ||చేతు||

  1. సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందజేసి రాత్రియందు సకల మేలు లంద జేయు స్వామి యేసుక్రీస్తూ నీకు ||చేతు||

  2. అన్నవస్త్రములను మాకు నన్ని వేళలందు నిచ్చి కన్న తండ్రివలెను బెంచు చున్న యేసుస్వామీ నీకే ||చేతు||

  3. విద్యా బుద్ధులన్ని యిచ్చి వింత వింత వరము లిచ్చి పెద్దల దయలోనుమమ్ము బెంపార జేయు మేసయ్యా ||చేతు||

  4. చిన్నవారి స్నేహితుడుగ నున్న యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు నిలలో నెపుడు కలుగుగాక ||చేతు||

Post a Comment

أحدث أقدم