రేగత్వరపడకు ఓర్చుకో కోపి

531

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రేగత్వరపడకు ఓర్చుకో కోపి గోడుజెందును ఓర్చుకో నీ కన్యాయమయినను కన్ను లెర్రజేయకు శాంత మొందు మెప్పుడు ఓర్చుకో.ఎవ్వడేని తిట్టిన ఓర్చుకో మేలుజేయు కీడుకు ఓర్చుకో లోకమందు సుఖము కొంతసేపు నుండును కోపమేల జేతువు? ఓర్చుకో.నీవు కీడునొందగా ఓర్చుకో ప్రతి కీడు జేయకు ఓర్చుకొనియుండుము అంత సరియగును నీకు జయముండును ఓర్చుకో.

Post a Comment

أحدث أقدم