అంధుడా రావా అరమరయేల

627

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...||అ||

  1. మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ||

  2. ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||

  3. లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||

  4. పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే ||అ||

  5. హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||

Post a Comment

أحدث أقدم